Friday, 15 July 2011

షిర్డి సాయిబాబా జాతక విశ్లేషణ


నిజానికి నేను బాబా గారి జాతకచక్రము గురించి గాని ఆ చక్ర విశ్లేషణ గాని ఎటువంటి ప్రయత్నము చెయ్య లేదు. అనుకోకుండా ఒకరోజు నా దినచర్య ఐనా వెబ్ విహారములో ఒక సైటు విపరీతముగా ఆకర్షించింది. ఇక అందులో విహరిస్తున్న నాకు బాబా గారి జన్మించిన తిధి వార విషయములు కనపడింది. 1838వ సంవత్సరము జన్మించిన బాబా గారి జాతక చక్రం తయారు చేద్దాం అనుకోని మొదలుపెట్టాను. అంతే ఒకటి తరువాత ఒకటి అన్నీ విషయములు చూడటము వాటిని వర్డ్ ఫైల్ తయారు చేయడము అయినది. వాటిని పబ్లిష్ చెయ్యవచ్చో లేదో కూడా తెలియదు. కానీ శ్రీ సత్యసాయి గారి విశ్లేషణ వ్రాసిన మీదట దానికి అందిన ప్రోత్సాహముపై షిర్డి బాబా గారి విశ్లేషణ ఇవ్వటము జరిగినది. మీ సలహాలు ప్రోత్సాహము ఇలాగే ఉంటే తరువాతి విశ్లేషణ మాజీ ప్రధాన మంత్రి, రాహుసర్ప యోగము కలిగిన వారి గురించి వ్రాద్దామని నా సంకల్పము. 
బాబా గారి జన్మ వివరములు దొరికిన వెబ్ సైటు లింకు: ఇక్కడ నొక్కుము
contributor: Subhasrini (Thanks to the contributor for giving the opportunity)

శ్రీ షిర్డి సాయిబాబా జాతక చక్రములో సూర్యుడు లగ్నము నుంచి 10వ స్థానము అంటే కర్మ స్థానములో గురుగ్రహమును, కేతుగ్రహమును combust చెయ్యడము చూడగలము. అంటే 'గురు మౌడ్యమి' అన్న మాట. లగ్నము గురువే కావడము కేతువు చంద్ర నక్షత్రమైన హస్త మీద ఉండుట వలన వారిరువురి మధ్యగల నైసర్గిక స్నేహముతో(గురువు, చంద్రుడు) ధార్మిక జీవితానికి భాష్యము బాబా గారి జీవితము ద్వారా చూపించగలిగారు భగవంతుడు.  చంద్రుడు పూర్వాషాడ నక్షత్రముపై ఉండుట వలన ప్రతి స్త్రీ తనలో గల నాలుగు అంశలలో మూడొంతులు పరోక్షముగా బాబా గారికి అందించడములో బాబా గారి జీవితము ధన్యమైనది. అలాగే శుక్రుడు సింహములో తన నక్షత్రములోనే గురు విభాగములో ఉండుటవలనను, కుజుడు నీచములో ఉండుట వలనను, కళత్ర స్థానాధిపతి ఐనా బుధుడు వక్రించుట వలన సంసార యోగము లేదు అన్నది గమనించగలము.  

 
ఏ రెండు గ్రహములైన అతి తక్కువ దూరములో కలసి ఉంటే వాటిలో బలవంతుడైనే గ్రహముచే ఆకర్షించబడిన రెండవ గ్రహము తన శక్తి సామర్ధ్యములను అప్పగించి నిర్వీర్యమై పోతుంది. అటువంటి జాతకుడు ఎటువంటి జీవితాన్ని అనుభవిస్తాడో మనకు శ్రీ సత్యసాయి బాబా జీవితమును గమనిస్తే తెలుస్తుంది. అక్కడ రజో గుణ గ్రహములు సూర్యునితో అస్తంగత్వము జరిగి ఆ ఆత్మకారకుడు రాజులాగా జీవితాన్ని గడపడము చూసాము.    అలాగే దానికి విరుద్దముగా సూర్యుడు సత్వ గుణకారుడైన గురు గ్రహమును మరియు తమో గుణకారుడైన కేతువును అస్తంగత్వము చేసి శ్రీ షిర్డి సాయి బాబా జీవితాన్ని ఉన్నత స్థితికి చేర్చడము చూసాము. మానవులైన వీరిరువురు కేవలము గ్రహస్థానముల పరముగా అత్యంత స్థితికి ఎదిగి దైవముగా నిలుచున్నారంటే ఎన్నో కోట్లమంది జనాభా కలిగిన ఈ విశ్వములో ఇటువంటి వారు ఎంతటి అరుదుగా ఉంటారో ఆలోచిస్తే మనము చేస్తున్న తప్పు ఏమిటో తెలుస్తుంది.
  
నిజమైన ధార్మిక జీవితము అనేది అత్యంత శుభప్రదమైనది. ఎంతో పుణ్యం చేసుకొంటే గాని లభించని జీవితము. ఈ జీవితములో స్వార్ధము, కపటము అనేది ఉండదు. ఇతరులకు సహాయ పడటము అనేది అత్యంత ఉచ్చ స్థితిలో ఉండే తత్వము. కానీ కర్మ సిద్దాంతము ప్రకారము పై “అభిప్రాయము” పూర్తి విరుద్దముగా వస్తుంది. అందువలన అది అప్రస్తుతము.  జ్యోతిష్య శాస్త్ర పరముగా బృహస్పతి అను గ్రహమును పై విధముగా నిర్వచించవచ్చు. అందుకే గురు గ్రహము సహజ శుభకరుడు అని శాస్త్రము ద్వారా తెలియ వస్తుంది.  అంతే కాక “మానవ సేవే మాధవ సేవా” అనేది ఈ ధార్మిక జీవితానికి మూలాధారము. ఎవరి జాతక చక్రములో “బృహస్పతి” ప్రముఖ పాత్రను పోషిస్తాడో వారి జీవితాలన్నీ ఈ రకమైన ధార్మిక జీవితానికి ఎంతో ముడిపడి ఉంటుంది. వీరికి తెలుసు భగవంతుడు అనేది సేవా కార్యక్రమమే కానీ ఆకార పూజా కార్యక్రమము కాదు అని మరియు ప్రతి జీవిలోను వీరు భగవంతుడిని ప్రత్యక్షముగా చూడగలరు.  ఇటువంటి ధార్మిక తత్వము తెలియని వారు లేదా జాతకరీత్యా ఆ తత్వము కొరపడినవారు మాత్రము విగ్రహారాధన లేదా దేవాలయముల చుట్టూ తిరుగుతూ తమ ధార్మిక తత్వములోని పరిమితులను చూపిస్తారు. ఈ సేవాతాత్పరతను విభిన్న కోణాలలో చూడవచ్చు. రజో గుణతత్వము కలవారు ధనసహాయము మాత్రమే చేస్తూ అనేక అభివృద్ది పనులు చేస్తారు. సత్వ గుణతత్వము కలవారు తామే ప్రతిపనిలో లీనమై ఎటువంటి పనులైన చేయగలరు. వీరిద్దరికి విరుద్దముగా తమో గుణతత్వము కలవారు సమాజములో గల చెడును మాత్రమే ఏరివేయుటలో తమ వంతు సహాయాన్ని అందిస్తూ వారి గుణతత్వమును సమర్దిస్తారు.  

పై విధముగా మోక్షకారకుడైన కేతువు కూడా ఇదే ధార్మికతత్వమును అనేక విభిన్న కోణములలో ప్రదర్శిస్తూ అందులో అధ్యాత్మిక భావాన్ని మిళితము చేస్తూ చాదస్తాన్ని అందచెయ్యడము చూస్తాము.  ఐతే చాదస్తపు పాళ్ళు ఎక్కువగా కలిగిన కేతువు ఎదుట వారినుంచి సహాయము ఎటువంటి పరిస్థితిలోనూ ఆశించక తమ మనుగడను సాగిస్తారు. అందువలన ఇటువంటి జాతకులనుంచి అధికమొత్తములో ధన సహాయము లభించక కేవలము మాట సహాయము మరియు దైవ సహాయము మాత్రమే లభించును. ఇందుమూలముగా ఈ జాతకుల పూర్వపుణ్యము కోరుకున్న వారికి ఆయాచితముగా లాభిస్తుంది. దీనినే మహిమలుగా చూడవచ్చు.
                                                               సందేహాలకు Email me

Wednesday, 25 May 2011

English
భగవాన్ శ్రీ సత్యసాయిశుక్ర గ్రహం అస్తంగత్వము (Venus combustion). అంటే శుక్ర మౌడ్యమి. హిందూ మతాచార వ్యవహారాలలో ఆ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది. శుభ కార్యాలు వంటివి జరుగవు. కానీ జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఇది చాలా మంచి రోజు. ఎందుకంటే శుక్రుడు శత్రు స్థానానికి నైసర్గిక అధిపతి. అటువంటి శుక్రుడు ఉదయించే బిందువు (Ascendant) ఆధీనంలోకి వెళ్తే జాతకచక్రం ప్రకారం ఆ జీవికి శత్రువు అనేవాడు లేడు. ఇటువంటి వారికి వివాహ యోగం లేదు. వీరికీ అందరూ మిత్రులే మరియు అందరూ ఈ జీవి యొక్క మేలు కోరెవారే. వీరి జన్మ ఇతరుల కొరకే. వీరు విశ్వమునకు అజాత శత్రువు అని చెప్పవచ్చు.
   
అసలు  మూడమి అంటే ఏమిటి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారము దీనిని గ్రహణము అని చెప్పవచ్చు. సూర్యునికి 12*లోపు ఏ గ్రహమైన ఉన్నచో వాటి యొక్క శక్తులను గ్రహించి ఆ గ్రహాలను నిర్వీర్యము చేయూటే "మౌడ్యమి' లేదా 'మూడమి'. గ్రహ స్తితి ఇలా ఉన్నప్పుడూ పుట్టే జాతకులు అరుదు. కారణము పూర్వ కర్మ ఫలము అనుకూలించడము అనేది అతి దుర్లభము. దీనిని అవగాహన  చేసుకోవడానికి మీరు భగవంతుడి అర్ధనారీశ్వర తత్వమును గురించి తెలుసుకుంటే మరింత సులభతరము. అర్ధనారీశ్వరతత్వములో వామ భాగము స్త్రీని ప్రతిబింబిస్తుంది. అటువంటి 'స్త్రీ' కి కారకత్వమే శుక్ర గ్రహము. ప్రతి మనిషి జీవితములో స్త్రీ వస్తూనే అంటే వివాహమయ్యాక వచ్చే కష్టాలకు కారకత్వము శని భగవానుడు. ఈ కష్టాలకు తెలివి తేటలు జోడించి తప్పించుకొనే మార్గమును చూపేవాడు (-)బుధుడు. వీరు ముగ్గురు సహజ మిత్రులు శత్రు వర్గానికి లేదా వామ భాగానికి. అటువంటి ముగ్గురు శ్రీ సత్య సాయిబాబా జన్మించినపుడు అస్తంగత్వము అంటే వారి శక్తులను పోగొట్టుకోవడము 'బాబా' గారి ఆత్మ పొందిన విజయము. ఆ ఆనందము మనము ప్రత్యక్షముగా చూసాము. ఆ జీవి అనుభవించిన రాజ యోగమునకు మనమందరము ప్రత్యక్ష సాక్షులము. ఇలాంటి యోగము కేవలము 12 రాసులలో శుభకరముగా రావడము అన్నది అత్యంత కష్టము. అందుకే 'బాబా' గారికున్న ఆత్మబలముతో సృష్టించిన అనేక అద్బుతాలు ఆ ఆత్మ యొక్క విజయగర్వానికి నిదర్శనాలు. మానవుడు తన ప్రవర్తనతో అనేక అద్బుతాలు చూపవచ్చు అనే 'బాబా' గారి మాటలకు తన జీవితమే ఒక ప్రత్యక్ష నిదర్శనము. కాకపోతే ఆత్మ సాధించిన విజయము అధర్మ పద్దతి అని బృహస్పతి గ్రహము పడ్డస్థానము వలన తెలుస్తుంది. అందువలన ఈ జన్మలో అదే అధర్మమే ఆయన ప్రాణాలకు మరణ కారణమైనది.

కలి యుగధర్మము ప్రకారము అంటే ధర్మము ఒంటి కాలితో నడిచే ఈ యుగములో ఇటువంటి వారు పుట్టడము "నభూతో నభవిష్యతి". ప్రతి మానవుడు భగవంతుడే అన్న సత్యాన్ని ఆచరించి 'బాబా' గారు కూడా భగవంతుడే అయ్యారు. ఈ తీరున ప్రతి జీవి ఇంకొకరి కోసమని జీవిస్తే అందరూ 'బాబా' గారి సరసకు వెళ్లవచ్చుననే ఎందుకు ఆలోచించారు? 'బాబా' నే భగవంతుడిగా పూజిస్తే ఆ జీవి బాగుపడటము అన్నది కల్ల. మరుసటి జన్మకు ఎదుటివారిని స్తుతించే వర్గానికి నాయకుడు అవుతారేమో! ఈ కలి యుగములో కేతు ప్రభావము ఉన్నంతవరకు ఇటువంటి జీవులు తనలోని భగవంతుడి గ్రహించక గాలిలో దీపము చందాన జీవించక తప్పదేమో. 

శత్రువులే లేనపుడు బాబా గారి మరణానికి కరణమేమిటీ అనే సందేహానికి నా విశ్లేషణ. తులా లజ్ఞానికి ఏకాదశ స్థానము భాధక స్థానము అవుతుంది. అటువంటి భాధక స్థానము బాబా గారి లాభ భావమునకు సంబంధించడము  ఆ తులా లగ్న ప్రత్యేకత. అందువల్ల బాబా గారి స్నేహితులు, తనవారు అనుకొన్నవాళ్లు బాబా గారి ఆత్మ వేదనకు కారకులు. కాబట్టి వారే ఆయన బౌతీక శరీరపు మరణాన్ని శాసించేవారు అవుతారు. ఇది కేవలము శరీరమునకు మాత్రమే. ఆత్మ తిరిగి పుట్టడానికి అవకాశము కలదు. కారణము బాబా గారి జన్మ కృష్ణ పక్షములో జరగడము వలనను, గురువు(బృహస్పతి) నీచస్థానములో ఉండుటవలన ఆత్మకు స్వర్గలోక ప్రాప్తి లేకున్నది. కావున తిరిగి జన్మించడం అనివార్యము. 

మరణించినపుడు గోచార రీత్యా సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉండుట, అదే సమయములో శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో ఉండుట వలన మరణము అనునది అసాధ్యము. నాకు అంతుపట్టని సమస్యలలో ఇది ఒక్కటి. కావున విజ్ఞులైన వారు తమ అభిప్రాయాలను తెలియచేయ్యగలరని  ఆశిస్తున్నాను.        
సందేహాలకు Email me

        సర్వే జనా సుఖినోభవంతు         

Wednesday, 27 April 2011

గొప్పవారి జాతక చక్ర గణన


జ్యోతిష్య శాస్త్రం నేర్చుకొన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయవలసిన పని తెలిసిన జాతకాలు విశ్లేషించడమే. ప్రస్తుత ఎలక్ట్రానిక్ యుగములో ఇంటర్నెట్ వృద్ది కారణముగా గొప్పవారి జాతకచక్రాలు కావలసినన్ని దొరుకుచ్చున్నవి. కావున శాస్త్ర విజ్ఞామునకు మనుజుని ఉత్సుకత పై  ఆధారపడి ఉంటుంది. అది లేనివాడు జ్ఞానర్జనకు పనికిరాడు. విశ్లేషణ గదా అని వితండముగా చెయ్యక శాస్త్ర పరిధిలో తన శైలిలో చేసుకోవడానికి భారతదేశములో ప్రతి ఒక్కరికీ ప్రాధమిక హక్కు ఉంది. అలా చేసిన విశ్లేషణకు పూర్తి బాధ్యత శాస్త్ర పరముగా వహించవలసి వస్తుంది. అందుకు సిద్దమైనవారికి హద్దులు లేవు. 
ఉదాహరణకు మరణించిన మన ముఖ్యమంత్రి "వై‌ఎస్‌ఆర్" గురించి చూద్దాం: 
1). క్రింద ఉదహరించిన ఇద్దరి జ్యోతిష్కుల విశ్లేషణ చూద్దాం. వీరిద్దరు తమ తమ బ్లాగుల ద్వారా వెలిబుచ్చిన ఫలితాలు కానీ, జాతక చక్రాలు కానీ సంబందము లేకపోవడము మరియు 'ముఖ్యమంత్రి' అని స్పృహతో కాస్తంత పొగుడుదాము అనుకొని విశ్లేషించడం గమనార్హం. ఇది జ్యోతిష్కులుగా చేయవలసిన పనా లేక తమ గొప్పదనామా అన్నది తేల్చవలసినది చదువరులైన మీరే.  


              

           ఇక్కడ నా ఉద్దేశము ఒకరి తప్పు ఎంచడము కాదు. ఇద్దరు చేసిన పని తమ బ్లాగులను ఉంచినది ఇంటెర్నెట్లోనే . కానీ చదువుతున్నవారిని అయోమయములో పడవేస్తున్న తీరు ఇది. తప్పు ఎక్కడ జరిగినది అంటే నేను తప్ప ఈ విషయమును చెప్పగలవాడు లేదు అనుకోవడమే. అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిన చందాన జరిగినది. ఇద్దరు ఈ విషయము గూర్చి ఇంటర్నెట్లో search చేసి ఉంటే బ్లాగులు కరెక్ట్టు చేసేవారు. చదువరినైనా నన్ను అసహనానికి గురి అయ్యి అదే ముఖ్యమంత్రి పై నా విశ్లేషణ ఇవ్వడానికి సందేహించవలసిన పరిస్తితి ఎదురైంది.  
     ఐనా మరణించిన వైనం బట్టి మాజీ ముఖ్యమంత్రి గారి అష్టమము సింహం అని, శని సింహంలో ఉన్నాడు కనుక "DETRIMENT", అంటే తను ఇవ్వగలిగినా సామర్ధ్యము 50% ఆగుట వలన బ్రతికిన life 60 కి దగ్గరగా ఉండవచ్చు అని తెలియ వస్తున్నది. 
     అంతే కాక మారక స్థానం, కళత్ర స్థానమైన కర్కాటక అధిపతి నీచంలో పడుట, మరియు ఆ స్థానములో పుత్ర, కర్మ స్థానాధిపతి ఉండుట మరిన్ని ఊహలకు ఆస్కారమిస్తున్నది. నైసర్గిక పుత్రకారకుడు ఐనా జుపిటర్ నీచములో ఉండి లగ్నానికి మద్దతు ఇవ్వడం కుభేర యోగం జాతకునికి కాక వేరొకరికి అని సూచిస్తున్నది. 
     పైపెచ్చు జుపిటర్ నీచములో ఉండుట ధర్మ, మత పర విషయాలలో సంకర తనాన్ని కోరుకుంటారని తెలియవస్తున్నది.  
     గత జీవితములో పోగొట్టుకున్న భాగ్యమును సంతరించుకొంటారని లగ్న భావము సూచిస్తున్నది.