Wednesday, 25 May 2011

English
భగవాన్ శ్రీ సత్యసాయిశుక్ర గ్రహం అస్తంగత్వము (Venus combustion). అంటే శుక్ర మౌడ్యమి. హిందూ మతాచార వ్యవహారాలలో ఆ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది. శుభ కార్యాలు వంటివి జరుగవు. కానీ జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఇది చాలా మంచి రోజు. ఎందుకంటే శుక్రుడు శత్రు స్థానానికి నైసర్గిక అధిపతి. అటువంటి శుక్రుడు ఉదయించే బిందువు (Ascendant) ఆధీనంలోకి వెళ్తే జాతకచక్రం ప్రకారం ఆ జీవికి శత్రువు అనేవాడు లేడు. ఇటువంటి వారికి వివాహ యోగం లేదు. వీరికీ అందరూ మిత్రులే మరియు అందరూ ఈ జీవి యొక్క మేలు కోరెవారే. వీరి జన్మ ఇతరుల కొరకే. వీరు విశ్వమునకు అజాత శత్రువు అని చెప్పవచ్చు.
   
అసలు  మూడమి అంటే ఏమిటి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారము దీనిని గ్రహణము అని చెప్పవచ్చు. సూర్యునికి 12*లోపు ఏ గ్రహమైన ఉన్నచో వాటి యొక్క శక్తులను గ్రహించి ఆ గ్రహాలను నిర్వీర్యము చేయూటే "మౌడ్యమి' లేదా 'మూడమి'. గ్రహ స్తితి ఇలా ఉన్నప్పుడూ పుట్టే జాతకులు అరుదు. కారణము పూర్వ కర్మ ఫలము అనుకూలించడము అనేది అతి దుర్లభము. దీనిని అవగాహన  చేసుకోవడానికి మీరు భగవంతుడి అర్ధనారీశ్వర తత్వమును గురించి తెలుసుకుంటే మరింత సులభతరము. అర్ధనారీశ్వరతత్వములో వామ భాగము స్త్రీని ప్రతిబింబిస్తుంది. అటువంటి 'స్త్రీ' కి కారకత్వమే శుక్ర గ్రహము. ప్రతి మనిషి జీవితములో స్త్రీ వస్తూనే అంటే వివాహమయ్యాక వచ్చే కష్టాలకు కారకత్వము శని భగవానుడు. ఈ కష్టాలకు తెలివి తేటలు జోడించి తప్పించుకొనే మార్గమును చూపేవాడు (-)బుధుడు. వీరు ముగ్గురు సహజ మిత్రులు శత్రు వర్గానికి లేదా వామ భాగానికి. అటువంటి ముగ్గురు శ్రీ సత్య సాయిబాబా జన్మించినపుడు అస్తంగత్వము అంటే వారి శక్తులను పోగొట్టుకోవడము 'బాబా' గారి ఆత్మ పొందిన విజయము. ఆ ఆనందము మనము ప్రత్యక్షముగా చూసాము. ఆ జీవి అనుభవించిన రాజ యోగమునకు మనమందరము ప్రత్యక్ష సాక్షులము. ఇలాంటి యోగము కేవలము 12 రాసులలో శుభకరముగా రావడము అన్నది అత్యంత కష్టము. అందుకే 'బాబా' గారికున్న ఆత్మబలముతో సృష్టించిన అనేక అద్బుతాలు ఆ ఆత్మ యొక్క విజయగర్వానికి నిదర్శనాలు. మానవుడు తన ప్రవర్తనతో అనేక అద్బుతాలు చూపవచ్చు అనే 'బాబా' గారి మాటలకు తన జీవితమే ఒక ప్రత్యక్ష నిదర్శనము. కాకపోతే ఆత్మ సాధించిన విజయము అధర్మ పద్దతి అని బృహస్పతి గ్రహము పడ్డస్థానము వలన తెలుస్తుంది. అందువలన ఈ జన్మలో అదే అధర్మమే ఆయన ప్రాణాలకు మరణ కారణమైనది.

కలి యుగధర్మము ప్రకారము అంటే ధర్మము ఒంటి కాలితో నడిచే ఈ యుగములో ఇటువంటి వారు పుట్టడము "నభూతో నభవిష్యతి". ప్రతి మానవుడు భగవంతుడే అన్న సత్యాన్ని ఆచరించి 'బాబా' గారు కూడా భగవంతుడే అయ్యారు. ఈ తీరున ప్రతి జీవి ఇంకొకరి కోసమని జీవిస్తే అందరూ 'బాబా' గారి సరసకు వెళ్లవచ్చుననే ఎందుకు ఆలోచించారు? 'బాబా' నే భగవంతుడిగా పూజిస్తే ఆ జీవి బాగుపడటము అన్నది కల్ల. మరుసటి జన్మకు ఎదుటివారిని స్తుతించే వర్గానికి నాయకుడు అవుతారేమో! ఈ కలి యుగములో కేతు ప్రభావము ఉన్నంతవరకు ఇటువంటి జీవులు తనలోని భగవంతుడి గ్రహించక గాలిలో దీపము చందాన జీవించక తప్పదేమో. 

శత్రువులే లేనపుడు బాబా గారి మరణానికి కరణమేమిటీ అనే సందేహానికి నా విశ్లేషణ. తులా లజ్ఞానికి ఏకాదశ స్థానము భాధక స్థానము అవుతుంది. అటువంటి భాధక స్థానము బాబా గారి లాభ భావమునకు సంబంధించడము  ఆ తులా లగ్న ప్రత్యేకత. అందువల్ల బాబా గారి స్నేహితులు, తనవారు అనుకొన్నవాళ్లు బాబా గారి ఆత్మ వేదనకు కారకులు. కాబట్టి వారే ఆయన బౌతీక శరీరపు మరణాన్ని శాసించేవారు అవుతారు. ఇది కేవలము శరీరమునకు మాత్రమే. ఆత్మ తిరిగి పుట్టడానికి అవకాశము కలదు. కారణము బాబా గారి జన్మ కృష్ణ పక్షములో జరగడము వలనను, గురువు(బృహస్పతి) నీచస్థానములో ఉండుటవలన ఆత్మకు స్వర్గలోక ప్రాప్తి లేకున్నది. కావున తిరిగి జన్మించడం అనివార్యము. 

మరణించినపుడు గోచార రీత్యా సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉండుట, అదే సమయములో శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో ఉండుట వలన మరణము అనునది అసాధ్యము. నాకు అంతుపట్టని సమస్యలలో ఇది ఒక్కటి. కావున విజ్ఞులైన వారు తమ అభిప్రాయాలను తెలియచేయ్యగలరని  ఆశిస్తున్నాను.        
సందేహాలకు Email me

        సర్వే జనా సుఖినోభవంతు         

No comments:

Post a Comment